అగ్రికల్చర్​ వర్సిటీ అప్లికేషన్​ల గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్, హార్టికల్చర్​ యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో అడ్మిషన్లకు అప్లికేషన్​ల గడువును ఈ నెల 29 వరకు పొడిగించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వినతుల మేరకు బైపీసీ స్ట్రీమ్​ ​కోర్సుల్లో దరఖాస్తు చేసుకునే తేదీని పెంచినట్టు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్. పి. రఘురామిరెడ్డి తెలిపారు. జులై12వ తేదీ నుంచి ఆగస్టు17వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించామని చెప్పారు. తొలి విడతలో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ సూచించారు. పూర్తి వివరాల కోసం అగ్రికల్చర్​ యూనివర్సిటీ వెబ్ సైట్ www.pjtsau.edu.in ను సందర్శించాలని సూచించారు.