
డీలిమిటేషన్ విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం, ప్రతిపక్షాలతో సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఆల్ పార్టీస్ మీటింగ్లో డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం ఎంకేస్టాలిన్ ఓ కీలక తీర్మానం చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్ చేపడితే1971 జనాభా లెక్కల ప్రకారం జరిగేలా చూడాలని ప్రధాని మోదీని కోరుతూ తీర్మానం చేశారు. ఇది మరో 30యేళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఎంపీల సంఖ్యను పెంచితే అన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం దామాషా ప్రాతినిధ్యం ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు.
తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని ప్రతిపక్ష అన్నాడీఎంకేతో సహా రాష్ట్ర పార్టీల సమావేశం బుధవారం (మార్చి 5) జరిగింది. అన్ని రాష్ట్రాలకు హిందీ, డీలిమిటేషన్‌పై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఆల్ పార్టీ మీటింగ్లో నటుడు విజయ్ పార్టీ తమిళనాడు వెట్రి కజగం కూడా పాల్గొంది. అయితే బీజేపీ, దాని మిత్రపక్షం తమిళ మనీలా కాంగ్రెస్ (ఎం)తో సహా ఐదు చిన్న ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు.
డీలిమిటేషన్‌పై తీర్మానం
1971 జనాభా లెక్కల ప్రకారం మొత్తం ఎంపీల సంఖ్య పెరుగుదల.. అదే నిష్పత్తిలో - రాష్ట్రాలకు ఎంపీలను గణించాలని హామీని కోరుతూ తీర్మానం చేశారు. దీనర్థం 1971 నుంచి తమిళనాడులో గణనీయంగా జనాభానియంత్రణ జరిగింది. ఇది తమిళనాడు ఎంపీ సీట్ల పెరుగుదలపై ప్రభావం చూపకూడదని తీర్మానం చేశారు.
2000లో అన్ని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు అప్పటి బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా 2026 నుంచి మరో 30 ఏళ్ల పాటు ఇదే ముసాయిదాను అనుసరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇవ్వాలని తీర్మానంలో కోరారు.
తమిళనాడు డీలిమిటేషన్‌కు వ్యతిరేకం కాదు. అయితే వివిధ సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రానికి డీలిమిటేషన్ శిక్షగా మారకూడదని ఈ సమావేశం అభ్యర్థిస్తోందని సీఎం స్టాలిన్ అన్నారు.
మరోవైపు ఇతర దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ పై అవగాహన కల్పించేందుకు సిద్దమైంది. డిలిమిటేషన్ పై ఆందోళన వ్యక్తం చేసిన తమిళనాడు..ఇతర దక్షి ణాది రాష్ట్రాల ఎంపీలు ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా తీర్మానం ప్రణాళికలు రూపొందించింది.
డీలిమిటేషన్ విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం, ప్రతిపక్షాలతో సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్న వేళ.. డీలిమిటేషన్పై తమిళనాడు ఆల్ పార్టీస్ మీటింగ్ తీర్మానం పరిగణనలోకి తీసుకుంటుందా..1971 జనాభా లెక్కల ప్రకారం ఎంపీల సంఖ్యను పెంచితే అన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం దామాషా ప్రాతినిధ్యం ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని చేస్తారనేది వేచి చూడాలి.