![40 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన థియేటర్ కూల్చివేత](https://static.v6velugu.com/uploads/2021/11/Demolition-of-the-Amba-Theater-with-a-history-of-40-years_TZqcGJ8gMW.jpg)
కరోనా మహమ్మారి చిత్రసీమను మాత్రమే కాదు థియేటర్ యజమాన్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ కరోనా దెబ్బకు హైదరాబాద్ మహానగరంలో పలు థియేటర్స్ మూతపడగా..ఇప్పుడు మెహిదీపట్నం లోని దాదాపు 40 ఏళ్ల క్రితం నాటి అంబా థియేటర్ ను నేలమట్టం చేసారు. మల్టీప్లెక్స్‌లు లేని సమయంలో అంబా థియేటర్ కు జనాలు పరుగులు పెట్టేవారు. అప్పట్లో ఈ థియేటర్‌లో సినిమా చూడాలంటే కొన్ని రోజుల ముందే టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది.
కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్ అప్పటి నుంచీ తెరుచుకోలేదు. ఇప్పుడు దీన్ని నేలమట్టం చేశారు. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తారా..? లేక మల్టీఫ్లెక్స్ నిర్మిస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. 1979లో 4,500 గజాల స్ధలంలో అంబా థియేటర్ ప్రారంభమైంది. ప్రేక్షకులు రాకపోవడంతోనే కూల్చివేశామని యజమాని డాక్టర్ బి కృష్ణారెడ్డి. నిర్వాహకుడు నిమ్మల సదానందం గౌడ్ తెలిపారు.