
నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణ్‌ఖేడ్ మండ లం వెంకటాపురం గ్రామానికి చెందిన వైష్ణవి అనే డాక్టర్ డెంగీతో మంగళవారం చనిపోయింది. ఖేడ్ హెడ్ కానిస్టేబుల్ రాములు కూతురైన వైష్ణవి నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాద్‌లో పీజీ చేస్తోంది.
మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో హైదరాబాద్‌లోనే ట్రీట్మెంట్ తీసుకుంది. తగ్గకపోవడంతో యశోద దవాఖానలో చేర్చగా డెంగీ అని తేలింది. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం కన్నుమూసింది.
ఖమ్మంలో..
ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామానికి చెందిన ఏర్పుల సునీత (33) డెంగీతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మూడు రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతూ ఖమ్మంలోని ఆరోగ్య దవాఖానలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో డాక్టర్లు హైదరాబాద్ తరలించాల్సిందిగా సూచించారు.
కుటుంబసభ్యులు సికింద్రాబాద్ యశోద దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. మృతురాలికి భర్త లింగయ్య, కొడుకు ఉన్నాడు.