ఖమ్మం జిల్లాలోని పల్లెటూర్లు మంచు దుప్పటి!

 ఖమ్మం జిల్లాలోని పల్లెటూర్లు మంచు దుప్పటి!

బుధవారం మంచు దుప్పటి కప్పుకున్నాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు పట్టడంతో అపార్ట్ మెంట్లపై నుంచి చూస్తే, మబ్బులే కిందకి దిగినట్టుగా కనిపించింది. ఖమ్మం రూరల్​మండలం పొన్నెకల్​ దగ్గర ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తాపడగా, బెలూన్స్​ ఓపెన్​ కావడంతో ప్రమాదం తప్పింది. – ఖమ్మం, వెలుగు