దండేపల్లి, వెలుగు: పిల్లల సర్వతోముఖాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని డీఈవో ఎస్.యాదయ్య అన్నారు. ఆయన శనివారం దండేపల్లి మండలంలోని వెలగనూరులోని హైస్కూలో తల్లిదండ్రులు–టీచర్ల సమావేశంలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు కలిసి విద్యార్థుల అభ్యున్నతిపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటేనే అది లాభదాయకంగా ఉంటుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఇండ్లలో ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉపాధ్యాయులకు వివరించాలని సూచించారు.
వెనుకబడి ఉన్న, హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థులను టీచర్లు గుర్తించి వారిలో మార్పు తెచ్చేలా కృషి చేయాలని సూచించారు. స్కూల్లో జరిగిన ఫుడ్ఫెస్టివల్ను సందర్శించిన డీఈఈ ఆహార మేళా తిలకించారు. అనంతరం స్కూల్కు క్రమం తప్పకుండా వస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారులు చౌదరి, సత్యనారాయణమూర్తి, శ్రీనివాస్, హెచ్ఎం విజయలక్ష్మి, టీచర్లు పాల్గొన్నారు.