కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు భట్టి. కాంగ్రెస్ హామీ ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగిస్తున్నామన్నారు. గతంలో తుక్కగూడలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటించామని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీ సీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 లకే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు.ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
పదేళ్ల పాలనలో గత ప్రభుత్వం.. ఆర్థిక సంక్షోభం, విద్యుత్ సంక్షోభాన్ని మిగిల్చిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేసీఆర్ నిర్వాకం వల్లే విద్యుత్, ఆర్దిక వ్యవస్థలను నిర్వీర్యం అయిందన్నారు. రాష్ట్రంలో ఇందరిమ్మ రాజ్యం ఏర్పడ్డాక ఈ రెండు వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. రాహుల్ గాంధీ దిశా నిర్దేశంతో కాంగ్రెస్ హామీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు.