అభివృద్ధిలో ముదిగొండ దూసుకెళ్తోంది.. : భట్టి విక్రమార్క

అభివృద్ధిలో ముదిగొండ దూసుకెళ్తోంది.. : భట్టి విక్రమార్క
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  • నాలుగు లేన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన

ముదిగొండ, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వంతోనే  ముదిగొండ అభివృద్ధిలో దూసుకెళ్తోందని ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ముదిగొండ నుంచి వల్లభి వరకు నాలుగు లైన్ల రహదారి అభివృద్ధి పనులకు ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ తో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ముదిగొండ నుంచి వల్లభి వరకు 5 కిలో మీటర్ల మేర ప్రస్తుతం ఉన్న రెండు లేన్ల రహదారిని రూ.28 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

రహదారి విస్తరణతో పాటు డ్రైనేజి, ఫుట్ పాత్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం సమస్యలపై మండల ప్రజలు ఆయనకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాలు శాఖ ఎస్ఈ హేమలత, ఈఈ యుగంధర్ రావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, అధికారులు పాల్గొన్నారు.