డ్రగ్స్ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డ్రగ్స్ మత్తులో విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. ఎంతోమంది అమాయకులు డ్రగ్స్ కు బానిసలవుతున్నారని చెప్పారు. దేశాన్ని నాశనం చేయడానికి డ్రగ్స్ వాడుతున్నారని విమర్శించారు. దేశంలో మానవ వనరులను దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ సరఫరాతో డబ్బులు సంపాదించాలనే ఆలోచన మంచిది కాదని సూచించారు భట్టి.
జలవిహార్లో నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, 2 వేల మంది కాలేజీ విద్యార్థులు హాజరయ్యారు.డ్రగ్స్ నిరోధానికి సైనికులుగా పనిచేస్తామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వల్ల నష్టాలను వివరిస్తూ పాట రిలీజ్ చేశారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహించింది నార్కోటిక్ బ్యూరో. ఇందులో విజేతలకు బహుమతులు ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి.
l