లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తాం : భట్టి విక్రమార్క

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం నాగర్ కర్నూల్ పర్యటనకు వెళ్తున్న ఆయనతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవికి షాద్ నగర్​లోని కేశంపేట బైపాస్ రోడ్డు వద్ద స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నేతలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం భూసేకరణ త్వరలోనే మొదలవుతుందన్నారు. ముందుగా భూ సర్వే కోసం ఒక ప్రణాళిక రూపొందించాక కార్యక్రమాలు మొదలవుతాయని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.