దేశానికి తెలంగాణ మోడల్ గా కులగణన జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గాంధీభవన్ లో పార్టీ కార్యకర్తలు, మంత్రులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ప్రజా సమస్యలను రిష్కరించేందకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజలతో సీఎం, మంత్రులు మమేకం అవుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. విద్యా,ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే వేలాది ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు భట్టి విక్రమార్క. సమాజంలో సగభాగమైన మహిళలలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు ఇస్తున్నామన్నారు. రాహుల్ పిలుపు మేరకే రాష్ట్రంలో కులగణన చేస్తున్నామని చెప్పారు. దీనిపై కొందరు రాజకీయ నాయకులు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.