
- ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ, వెలుగు: పేదల కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం డిండి, చందంపేట మండల కేంద్రాల్లో, నేరేడుగొమ్ము మండలంలోని పలుగు తండా, దేవరకొండ పట్టణంలో ని పలు రేషన్ షాపుల్లో గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి బియ్యం పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తామని పేర్కొన్నారు.
అంతకుముందు చింతపల్లి మండలంలోని పోలేపల్లి (రాంనగర్)లో శ్రీ మైసమ్మ దేవాలయ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. ఏఎస్పీ మౌనిక, ఆర్డీవో రమణారెడ్డి, నల్గొండ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ ఎంఏ.సిరాజ్ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు రాజేశ్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.