Devendra Fadnavis:మూడోసారి మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. ప్రధాని సమక్షంలో ప్రమాణస్వీకారం

Devendra Fadnavis:మూడోసారి మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. ప్రధాని సమక్షంలో ప్రమాణస్వీకారం

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర సీఎంగా మూడోసారి ఎన్నికైన ఫడ్నవీస్..గురువారం ( డిసెంబర్ 5)  సాయంత్రం ముంబై లోని అజాద్  మైదాన్ లో గవర్నర్ ఇద్దరు డిప్యూటీ సీఎం లు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ తో కలిసి ప్రమాణం చేశారు. 

దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు, డిప్యూటీసీఎంలు, బీజేపీ నేతలు  హాజరయ్యారు. 

ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజంయ సాధించి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే 2022లో కూటమి ఒప్పందంలో భాగంగా సీఎం పదవిని త్యాగం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ..అనుకున్నట్లుగానే ఈసారి సీఎం పదవి వరించింది.

 గత వారం రోజులుగా మహాసీఎం ఎవరు అవుతారని ఉత్కంఠకు తెరదించి.. డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ఒప్పుకోవడంతో బుధవారం మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఖరారు చేశారు.