భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కరీంనగర్, ధర్మపురి, కొండగట్టు, వేములవాడతో పాటు ఆయా ప్రధాన పట్టణాల్లో  ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని భక్తులు  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్ని వైష్ణవాలయాల్లో భక్తులు కిటకిటలాడారు.ఉదయం నుంచే ఆయా ఆలయాల వద్ద సందడి నెలకొంది.  - వెలుగు, నెట్ వర్క్