
ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం జిల్లా జైలును ఆదివారం జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా జైల్లో ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు, సదుపాయాలను తెలుసుకున్నారు. ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్యం, న్యాయ సహాయాలపై విచారణ చేశారు. జైలులో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన లైబ్రరీని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఖైదీల కిచెన్, స్టాఫ్ కిచెన్ ను, హాస్పిటల్ ను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జైలులో ఖైదీలతో నడుపుతున్న ఫ్యాక్టరీని సందర్శించి అక్కడ తయారు చేస్తున్న వస్తువులను పరిశీలించారు. ఖైదీల మనోవికాసం, వారి ఆరోగ్యం కోసం చేపట్టిన స్పోర్ట్స్ మీట్ గురించి వివరించారు. కార్యక్రమంలో వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, జిల్లా జైలు సూపరింటెండెంట్ ఏ.శ్రీధర్, జైలర్లు సక్రు, లక్ష్మీనారాయణ డిప్యూటీ జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు