టెక్నాలజీతో సేవలను వేగవంతం చేయాలి : డీజీపీ జితేందర్

టెక్నాలజీతో సేవలను వేగవంతం చేయాలి : డీజీపీ జితేందర్
  • డీజీపీ జితేందర్ 

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: ఆధునిక టెక్నాలజీతో సేవలను వేగవంతం చేసి కేసులను త్వరగా పరిష్కరించాలని డీజీపీ జితేందర్  సూచించారు. మహబూబ్​నగర్  పోలీస్​ కార్యాలయంలో కమాండ్  అండ్  కంట్రోల్ రూమ్​ను శుక్రవారం డీజీపీ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ ఆఫీస్​ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. మహబూబ్​నగర్, నారాయణపేట ఎస్పీలు జానకి, యోగేశ్  గౌతమ్  నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలను పవర్  పాయింట్  ప్రజంటేషన్  ద్వారా వివరించారు. 

ఈ సందర్భంగా డీజీపీ  మాట్లాడుతూ ప్రజలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని,పెండింగ్  కేసులను త్వరగా పరిష్కరించాలని, ఆధునిక టెక్నాలజీని వినియోగించి సేవలను వేగవంతం చేయాలన్నారు. కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలగా పని చేయాలని సూచించారు. అనంతరం మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలను అందించారు. మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ, జోగులాంబ జోన్-7 డీఐజీ ఎల్ఎస్  చౌహాన్, అడిషనల్​ ఎస్పీలు రాములు, సురేశ్ కుమార్, ఎండీ రియాజ్ ఉల్ హక్, డీడిఎస్పీలు ఎన్  లింగయ్య, వెంకటేశ్వర్లు, రమణా రెడ్డి, సుదర్శన్, గిరిబాబు, సుదర్శన్  పాల్గొన్నారు.