రాజన్న అనుబంధ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నెల రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయని దేవస్థానం అధికారులు తెలిపారు.

ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, తిరుప్పావై ప్రవచనం, భజనలు జరగనున్నాయి. స్వామివారికి మొదటి 15 రోజుల చక్కెర పొంగళి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత 15 రోజులు దద్దోజనం సమర్పిస్తారు. భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.