ధనుష్ కొత్త మూవీలో అమెరికన్ నటి

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్‌‌తో బిజీగా ఉన్నాడు ధనుష్.  హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్న ధనుష్.. మరోవైపు ఫకీర్, గ్రే మ్యాన్‌‌ లాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్‌‌లోనూ నటించాడు. తాజాగా మరో విదేశీ చిత్రంలో నటించబోతున్నాడు.‘సిడ్నీ స్ట్రీట్ ఫైటర్‌‌‌‌’ టైటిల్‌‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌‌ నిర్మిస్తోంది.  ఓ వీడియో గేమ్ ఫ్రాంచైజీ ఆధారంగా దీన్ని తెరకెక్కించనున్నారు. 2026 మార్చి 20న విడుదల కానుంది. అమెరికన్ నటి సిడ్నీ స్వీనీ ఇందులో ధనుష్‌‌కి జంటగా నటించబోతోంది.

ALSO READ : కేవీ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ హీరోగా ఫంకీ సినిమా

 యుఫోరియా, ది వైట్ లోటస్‌‌ లాంటి సిరీస్‌‌తో ఆమె పాపులర్.  ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’ లాంటి  హాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది.  ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌‌లో ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్న ధనుష్.. మరోవైపు ‘ఇడ్లీ కడై’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మరోవైపు ఇళయరాజా లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంతో పాటు ఓ బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నాడు.