వరల్డ్ కప్ లో ప్రస్తుతం మాక్స్‌వెల్ పేరు మారు మ్రోగిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ పై వీరోచిత డబుల్ సెంచరీ చేసి ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఆసీస్ స్టార్ పై దిగ్గజాల నుండి సగటు క్రికెట్ అభిమాని వరకు ప్రశంసల వర్షం కురుస్తుంది. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో ఆసీస్ పరాజయం ఖాయం అనుకున్నారు. కానీ కెప్టెన్ కమ్మిన్స్ తో కలిసి మ్యాక్సీ ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు ఎంత చెప్పుకున్నా తక్కువే.
128 బంతుల్లో, 21 ఫోర్లు, 10 సిక్సులతో 201 పరుగులు చేసి వన్డే క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి తమ జట్టును ఒంటి చేత్తో సెమీ ఫైనల్ కు తీసుకెళ్లాడు. ఒక పక్క మ్యాక్స్ వెల్ పై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం దీని వెనుక ధోనీ హస్తం ఉందని వాదన చేస్తున్నారు. అసలు ఇంతకీ ధోనీకి మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ కు సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం.
ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ చివరి వరకు క్రీజ్ లో ఉండి అసాధారణ పోరాటంతో ఆసీస్ కు విజయాన్ని అందించాడు. దీంతో సోషల్ మీడియాలో మ్యాక్స్ వెల్, ధోనీ ఎవరు బెస్ట్ ఫినిషర్ అనే ప్రశ్న ఎదరైంది. మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో మాక్స్‌వెల్, ధోనిని పోలుస్తూ ఎవరు బెస్ట్ ఫినిషర్? అనే చర్చ నడిచింది. దీనికి ఒక నెటిజన్ వెరైటీగా స్పందించాడు.
మాక్స్‌వెల్ భార్య చెన్నైకు చెందిన మహిళ. అందుకే మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ వెనుక ఉన్నాడని.. మాక్స్‌వెల్, అతని భార్య వినీ రామన్ ఫోటోను జత చేస్తూ పోస్టర్ రాశారు.
ధోనీకి చెన్నైలో ఎంత క్రేజ్ ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నైని 5 సార్లు చాంపియన్ గా నిలిపిన మాహీ.. ఈ సిటీతో ఎంతో అనుబంధం ఉంది. మ్యాక్స్ వెల్ భార్య వినీ రామన్ కూడా చెన్నై కావడంతో ధోనీ ఫినిషింగ్ లక్షణాలు మ్యాక్స్ వెల్ కు వచ్చినట్టు చెప్పుకొచ్చాడు. మొత్తానికి అస్సలు సంబంధం లేకపోయినా ధోనీ ఫ్యాన్స్ మాత్రం ఇది చూసి తెగ సంబరాలు చేసుకుంటున్నారు.
When your life partner is from thala's den(Chennai) , then you are destined for greatness
— Jane Rodriguez (@icrythennn) November 7, 2023
Huge credits to thala for this amazing knock pic.twitter.com/rn67xUD9Sf