పట్టణాల్లో టెలికం సర్వీస్‌‌‌‌‌‌‌‌లకు డిజిటల్ భారత్ నిధి

పట్టణాల్లో టెలికం సర్వీస్‌‌‌‌‌‌‌‌లకు డిజిటల్ భారత్ నిధి

న్యూఢిల్లీ: పట్ణణాల్లోనూ  టెలి కమ్యూనికేషన్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను మెరుగుపరిచేందుకు  డిజిటల్‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌ నిధి ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను వాడతామని  ప్రభుత్వం ప్రకటించింది. సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అఫోర్డబుల్ ధరలో   అందించడం,  సెక్యూరిటీని మెరుగుపరచడం వంటి అదనపు సౌకర్యాలను కల్పిస్తామని  తెలిపింది. డిజిటల్ భారత్ నిధి సైజ్‌‌‌‌‌‌‌‌  రూ.80 వేల కోట్లు.  ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌  కింద టెలికం స్కీమ్‌‌‌‌‌‌‌‌లకు, ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లకు ఫండ్స్ అందిస్తారు.

మొబైల్, బ్రాడ్ బ్యాండ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అందించే ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లకు ఫండ్స్ ఇస్తారు. అలానే  వీటికి అవసరమయ్యే టెలికమ్యూనికేషన్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ను  అందిస్తారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అందించేందుకు గతంలో యూనివర్సల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌‌‌‌‌‌‌‌ఓఎఫ్‌‌‌‌‌‌‌‌) ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం చేసేది.