రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ పాత రోజులు గుర్తు చేస్తున్నాడు. గతంలో ఆర్సీబీ ఫినిషర్ గా ఎన్నో విజయాలను అందించిన ఈ సీనియర్ బ్యాటర్ గత సీజన్ లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ ఇతనిపై ఆశలు పెట్టుకోవడం మానేశారు. అయితే కార్తీక్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో మాత్రం తనలోని ఫినిషింగ్ లెవల్స్ తో అదరగొడుతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే కార్తీక్ ఇంతలా బ్యాటింగ్ లో రాణించడానికి టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ కారణమట.
Also Read: జూనియర్ మలింగ వచ్చేశాడు.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్
నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ అనంతరం మాట్లాడిన కార్తీక్..రింకూ సింగ్ ను ఆకాశానికెత్తేశాడు. "నేను బ్యాటింగ్ బాగా చేయడానికి రింకూ సింగ్ నుంచి స్ఫూర్తి పొందాను. నేను చూసిన అద్భుతమైన ప్లేయర్లలో రింకూ ఒకడు. నా బ్యాటింగ్ ప్రాక్టీస్ ను సీరియస్ చేస్తున్నాను. ఈ ఘనత న కోచ్ కు దక్కుతుంది. అతను దశాబ్ధకాలంగా నాతోనే ఉన్నారు". అని స్టార్ స్పోర్ట్స్ తో కార్తీక్ అన్నాడు.
నిన్న(మార్చి 25) పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కార్తీక్ 10 బంతుల్లోనే 28 పరుగులు చేసి ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించాడు. చివరి నాలుగు ఓవర్లలో 47 పరుగులు చేయాల్సిన దశలో లోమరోర్ తో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ జట్టుకు టోర్నీలో తొలి విజయాన్ని అందించాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనూ 39 పరుగులు చేసి జట్టుకు డీసెంట్ టోటల్ అందించాడు.
DK giving credit to Rinku Singh. ? #DineshKarthik #RCB #IPL #cricket
— In Trend Today (@in_trend_today) March 26, 2024
pic.twitter.com/oVbeN1rjzz