భరత్ రాజ్, దివి జంటగా నవీన్ గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లంబసింగి’(Lambasingi).బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna) సమర్పణలో ఆనంద్.టి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 15న థియేటర్స్‌లో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఒక స్వచ్ఛమైన ప్రేమకథను కళ్ళకు కట్టినట్లు సహజంగా చూపించారు డైరెక్టర్ నవీన్ గాంధీ. ఆర్.ఆర్.ధ్రువన్ అద్బుతమైన పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఇచ్చాడు. హృదయాన్ని కదిలించే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయిన లంబసింగి సక్సెస్ మీట్ లో..ఈ సినిమాని నిర్మించిన దర్శక నిర్మాత కళ్యాణ్ కృష్ణ కురసాల మాట్లాడారు.
"ముందుగా మీడియా వారికి ధన్యవాదాలు. లంబసింగి సినిమాకు మీడియా వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఒక డైరెక్టర్ గా ఉండి..ఈ సినిమాని ఇంకో దర్శకుడితో చెయ్యడానికి కారణం ఏంటంటే..సినిమాలో ఉండే స్ట్రగుల్ బయట స్ట్రగుల్ కంటే 100 శాతం ఎక్కువగా ఉంటుంది. లైఫ్ లో అందరు రిస్క్ చేయాలి.
నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్షన్ చెయ్యడానికి ఏడేళ్లు ఎదురుచూశాను. అందరికీ టాలెంట్ ఉంటుంది. కథ రెడీ చేసుకుని తిరుగుతూ ఉంటారు.టైం వస్తదని వెయిట్ చేస్తుంటారు. కానీ, టైం ఎప్పుడో వస్తదో తెలియదు. సినిమా ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరి కలలకు టైం పడుతుంది. కానీ, ఏళ్లు గడుస్తుండటం.. అవకాశాలు రాకపోవడం..చుట్టూ ఉండే వాళ్ళ నుంచి,అలాగే ఫ్యామిలీస్ నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సక్సెస్ అవ్వని అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే..అతనొక్కడే కాదు..అతని ఫ్యామిలీ కూడా స్ట్రగుల్ అవుతూనే ఉంటుంది.
ALSO READ :- ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల తొలగింపు: ఈసీ ఉత్తర్వులు
టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాకా చాలా మంది ఉంటారు. నేను కూడా అలా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుచేత నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టాను" అని డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెలిపారు.