Rajamouli Premalu Review: నా ఫేవరెట్‌ మాత్రం ఆదినే..ప్రేమలు మూవీపై రాజమౌళి ప్రశంసలు

గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు (Premalu) మూవీ (ఫిబ్రవరి 9న)  మళయాలంలో రిలీజై ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. సుమారు రూ.3కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ప్రేమలు మూవీ రూ.80 కోట్ల కలెక్షన్ల మార్కును చేరుకుంది. 

నెల్సన్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ..ఇవాళ తెలుగులో మహా శివరాత్రి సందర్బంగా మార్చి 8న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. మలయాళంలో యూత్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసిన ప్రేమలు..తెలుగు ఆడియన్స్కి కూడా నచ్చేసింది. 

తాజాగా ప్రేమలు సినిమా తనకెంతో నచ్చిందని దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ప్రశంసలు కురిపించారు. ‘‘ప్రేమలు చిత్రాన్ని కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేసినందుకు చాలా సంతోషిస్తున్నా. సినిమా ఆద్యంతం నవ్వులు పంచింది. మీమ్‌యూత్‌ లాంగ్వేజ్‌ను ప్రేక్షకులకు చక్కగా అందించేందుకు రచయిత అద్భుతంగా పని చేశారు.

ALSO READ:- చిలక జ్వరం..ఐదుగురికి చంపేసింది

ట్రైలర్‌ చూసినప్పుడే రేణు పాత్ర నాకెంతో నచ్చేసింది. సినిమా చూశాక సచిన్‌ కూడా నచ్చేశాడు. ఏది ఏమైనా నా ఫేవరెట్‌ మాత్రం ఆదినే (జస్ట్‌ కిడింగ్‌)’’ అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.ప్రస్తుతం ఈ మూవీకి యూత్ లో బాగా క్రేజీ పెరిగింది. ఈ వీకెండ్ సినీ లవర్స్ కి..రియల్ లవర్స్ కి పండుగనే చెప్పుకోవాలి. 

ప్రేమలు తెలుగు వెర్షన్‍కు 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ అందించారు. అతడు రాసిన డైలాగ్స్ ట్రెండ్‍కు తగ్గట్టు ట్రైలర్లో భలే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ (SS Karthikeya) దక్కించుకున్నాడు.