పంటల వివరాలు నమోదు చేయించాలి : తిరుమల ప్రసాద్​ 

పంటల వివరాలు నమోదు చేయించాలి : తిరుమల ప్రసాద్​ 

సదాశివనగర్, వెలుగు: జిల్లాలో రైతులు పండిస్తున్న పంటల వివరాలను  ఆన్​లైన్​లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్​ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండలంలోని మోడెగామ గ్రామంలో రైతులు పండిస్తున్న పంటలను పరిశీలించి, వివరాలు నమోదు చేశారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు పండిస్తున్న వరి, పత్తి, సోయా, చెరుకు, మక్క పంటలను ఆశించే తెగుళ్లు గుర్తించి అగ్రికల్చర్​ ఆఫీసర్ల సూచనల మేరకు మందులు పిచికారీ చేయాలన్నారు. పంటల వివరాలు ఆన్​లైన్​లో నమోదు  చేయించుకోవాలని సూచించారు. ఆయన వెంట  మండల అగ్రికల్చర్​ ఆఫీసర్​ ప్రజాపతి, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.