సన్నవడ్ల కొనుగోలులో రూల్స్​ పాటించాలి :చందన్ కుమార్

 సన్నవడ్ల కొనుగోలులో రూల్స్​ పాటించాలి :చందన్ కుమార్
  • జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్

ముదిగొండ, వెలుగు :  --సన్నవడ్ల కొనుగోలులో నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ముదిగొండలోని సత్యసాయి రైస్ మిల్లులను అదివారం  ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూసుమంచి మండలంలోని పాలేరు గ్రామంలో ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లు వద్ద ధాన్యం అన్ లోడింగ్ కు సమస్యలు రాకుండా ముందే ప్లానింగ్ చేసుకోవాలన్నారు. రైస్ మిల్లుల వద్ద అవసరమైన మేర హమాలీలు అందుబాటులో ఉండాలని చెప్పారు. తరుగు తీయకుండా ధాన్యాన్ని ఎప్పటికప్పుడుదింపుకోవాలన్నారు. 100 శాతం కొనుగోలు ధాన్యం వివరాల ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.