అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం, వెలుగు: అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం అటవీశాఖ కార్యాలయ భవన శతాబ్ది ఉత్సవాల్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా. సి. సువర్ణ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ సి సి ఎఫ్ డా. భీమా నాయక్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులకు నివాళులర్పించారు. అటవీశాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన, శాఖలో పనిచేస్తున్న అధికారులు తమ అనుభవాలను తెలిపారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ పై డాక్యుమెంటరీ ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,.. ప్రకృతిని ప్రక్కన పెట్టుకొని, ప్రకృతి వెంట నడిస్తేనే అన్ని విధాలా ప్రయోజనమన్నారు. అటవీశాఖ కార్యాలయం, కలెక్టర్ క్యాంపు కార్యాలయం, పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాలు వంద సంవత్సరాల కింద నిర్మించినా..  ఇప్పటికి ఉపయోగంగా  ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మంది పెద్దలు అద్భుతంగా పనిచేశారు కాబట్టి,   ఇప్పుడు తమకు ఇక్కడ  పనిచేసే అదృష్టం కల్గిందని భావిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ విశ్రాంత అధికారులు, ఎఫ్డివో లు, ఎఫ్ఆర్వో లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.