నీటి ఎద్దడి లేకుండా చూడాలి

నీటి ఎద్దడి లేకుండా చూడాలి

లింగంపేట, వెలుగు: రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటిఎద్దడి లేకుండా పంచాయతీ సెక్రటరీలు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా డీఆర్​డీఏ పీడీ, లింగంపేట మండల ప్రత్యేకాధికారి సురేందర్​అన్నారు. శుక్రవారం ఆయన లింగంపేట ఐకేపీ కార్యాలయంలో నీటిఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రతలపై పంచాయతీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. 

గ్రామాల్లో తాగునీటి సమస్యను గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీలు విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని చెప్పారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎల్​పీవో సురేందర్, ఎంపీడీవో నరేశ్, ఎంపీవో మలహరి, ఆయా గ్రామాల సెక్రటరీలు పాల్గొన్నారు.