నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆవరణలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు మినీ జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రవికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. మెడ్ ప్లస్ సంస్థలో మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో పనిచేసేందుకు 40 ఫార్మాసిస్ట్, 50 కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, 100 జూనియర్ అసిస్టెంట్, 30 ఆడిట్ అసిస్టెంట్ పోస్టులకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఫార్మాసిస్ట్కు పీసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో కూడిన డి/బి ఫార్మసీ అర్హత ఉండాలన్నారు. మిగతా పోస్టులకు టెన్త్/ఇంటర్/ఏదేని డిగ్రీతోపాటు 18 నుండి30 సంవత్సల వయస్సు కలిగి ఉండాలన్నారు. ఇతర వివరాలకు 9392310323, 9110368501లో సంప్రదించవచ్చని.. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.