రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

ఆర్మూర్​, వెలుగు : - ఈ నెల 16,17, 18 వ తేదీల్లో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో జరగనున్న రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల పురుషుల హాకీ టోర్నమెంట్​కు జిల్లా జట్టు ఎంపికైంది.  గురువారం ఆర్మూర్​లోని మినీ స్టేడియంలో ఎంపిక పోటీలు నిర్వహించినట్లు జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు. 

ఎంపికైన జట్టు ఈనెల 15న హుజూరాబాద్ కు బయలు దేరుతుందన్నారు.  జిల్లా హాకీ సంఘం అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొండ్రా అంజు, ఈసీ మెంబర్ సడాక్ నగేష్, సీనియర్ క్రీడాకారులు జిన్నా గంగాధర్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.