81 వసతి గృహాల్లో వైద్య శిబిరాలు

 81 వసతి గృహాల్లో వైద్య శిబిరాలు

ములుగు, వెలుగు: ములుగు జిల్లాలోని 81 ప్రభుత్వ బాలురు, బాలికల వసతి గృహాల్లో వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్​వో అల్లెం అప్పయ్య తెలిపారు. సోమవారం ఆయన గోవిందరావుపేట మండలం చల్వాయి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో నిర్వహించిన  వైద్య శిబిరాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్​వో మాట్లాడుతూ జిల్లాలో మంగపేటకు డిప్యూటీ డీఎంహెచ్​వో విపిన్ కుమార్, వెంకటాపురం, వాజేడు మండలాలకు డాక్టర్ క్రాంతి కుమార్, తాడ్వాయికి డాక్టర్ శ్రీకాంత్, ములుగు, వెంకటాపూర్ మండలాలకు డాక్టర్ రణధీర్, గోవిందరావుపేట్ మండలానికి డాక్టర్ భవ్యశ్రీను ప్రోగ్రాం అధికారులుగా నియమించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 83 క్యాంపులు నిర్వహించామని, 13,927  మంది విద్యార్థులకు, 5,253 పిల్లలను పరీక్షించామన్నారు. 311 మందికి జ్వరాలు ఉన్నట్లుగా గుర్తించి, మందులు అందించామని పేర్కొన్నారు.