విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ములుగు, వెలుగు: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యసిబ్బందికి డీఎంహెచ్​వో  గోపాల్ రావు సూచించారు. ములుగు మండలం రాయిని గూడెం పీహెచ్​సీ పరిధిలోని జగ్గన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించి వంటశాల, భోజనం, స్టోర్​ రూంలను పరిశీలించారు. రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. 

విద్యార్థులకు వడదెబ్బపై అవగాహన కల్పించారు. అనంతరం పత్తిపల్లి ఆయుష్మాన్​ఆరోగ్య మందిర్​ను సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. వైద్యసిబ్బందితో మాట్లాడుతూ గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధిహామీ పథకాల ప్రాంతాలను గుర్తించి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఎస్​కే టీం డాక్టర్ శ్రీలత, డాక్టర్ మల్లికార్జున్, ఆరోగ్య కార్యకర్త ఉపేంద్ర, తిరుపతమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.