కరీంనగర్ టౌన్, వెలుగు: అయోడైజ్డ్ ఉప్పునే వంటల్లో ఉపయోగించాలని డీఎంహెచ్‌వో సుజాత సూచించారు. మంగళవారం ప్రపంచ అయోడిన్ అవగాహన దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో సదస్సు నిర్వహించారు.
అనంతరం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ....అయోడైజ్డ్ ఉప్పు వాడకంతో చురుకుదనం, మానసిక ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. ప్రతిరోజూ 5గ్రాముల ఉప్పు మాత్రమే వాడాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు ఉమాశ్రీరెడ్డి, సనా, జవేరియా, డీపీవో స్వామి పాల్గొన్నారు.
జగిత్యాలలో ప్రైవేట్ హాస్పిటల్ తనిఖీ
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రైట్ ప్రైవేట్ హాస్పిటల్‌ను డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎన్.శ్రీనివాస్ తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ టైం లో సమర్పించిన డాక్యుమెంటేషన్, అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్, సిబ్బంది అందించిన వివరాల ప్రకారం అందుబాటులో ఉన్నారా లేదా అని పరిశీలించారు. తనిఖీల్లో అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు.