అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎలక్షన్ కమిషన్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఎన్నికల కమిషన్ చెకింగ్ పాయింట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం రూ.9 కోట్ల విలువైన అమెరికన్ డాలర్ల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బులు కొలాబాలోని ఓ బ్యాంక్ కు చెందినట్లు ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న వారు చెప్పారు. డబ్బు తీసుకెళ్తున్న లాజిస్టిక్స్ కంపెనీ డాలర్లకు సంబంధించిన బ్యాంక్ డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. పూర్తి ఆధారాలు చూపించేంత వరకు ఆ ఫారిన్ కరెన్సీ కస్టమ్స్ అధికారుల ఆధీనంలో ఉంటుంది. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరి కొలాబా వైపు వెళ్తుండగా.. కైవల్యధామ్ వద్ద ఈసీ ఆపీసర్లు పట్టుకున్నారు.
Also Read :- దేవీరమ్మ జాతరలో తొక్కిసలాట.. కొండపై నుంచి జారిపడ్డ భక్తులు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 15న కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది. సరైన పత్రాలు, ఆధారాలు లేకుండా భారీగా నగదు తీసుకెళ్లకూడదు. అక్టోబర్ 31 వరకు మొత్తం రూ.100 కోట్లకు పైగా అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన ఆభరనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సరైన లెక్కలు చూపించి బాధితులు తీసుకెళ్లవచ్చు. ఎన్నికల సంఘం (EC) మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించేలా చూసేందుకు మహారాష్ట్రలో 5వేల ఫ్లయింగ్ స్క్వాడ్‌లను మోహరించింది. కోడ్ అమలులోకి వచ్చిన మొదటి 15 రోజులలో రూ.187 కోట్లు లెక్కింపని ఆస్తులను EC జప్తు చేసింది. ఆస్తుల్లో అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన లోహాలు, ఇతర వస్తువులు ఉన్నాయని అదనపు ఎన్నికల కమిషనర్ డాక్టర్ కిరణ్ కులకర్ణి అన్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, విలువైన వస్తువులు చట్టబద్ధమైన లావాదేవీలైతే.. వాటి యజమానులు సరైన పత్రాలు చూపిస్తే..24 గంటల్లోగా వాటిని విడుదల చేస్తామని ఆయన అన్నారు.