రాములోరి అన్నదానానికి రూ.లక్ష విరాళం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు గురువారం వివిధ రూపాల్లో విరాళాలు అందజేశారు. హైదరాబాద్​కు చెందిన కొండమీద వెంకటరమణయ్య తన తల్లిదండ్రుల పేరిట నిత్యాన్నదానం కోసం రూ.లక్ష ఇచ్చారు.

కర్నాటకలోని వైష్ణవ సంప్రదాయ పరకాల మఠం నిర్వాహకులు కృష్ణారెడ్డి ఐదు ఇత్తడి గుండిగలను అందజేశారు. స్వామివారి నైవేద్యాలు తయారీకి వాటిని వినియోగించాలని కోరారు. ఈవో రమాదేవి వాటిని అందుకున్నారు.