మిస్ట్ కాలేజీలో మూడు రోజుల వర్క్ షాప్

మిస్ట్ కాలేజీలో  మూడు రోజుల వర్క్ షాప్

సత్తుపల్లి, వెలుగు : మదర్ థెరిసా ఇంజినీరింగ్​ కాలేజీలో సోమవారం నుంచి 3 రోజుల పాటు బీటెక్ థర్డ్ ఇయర్ సీఎస్​సీ విద్యార్థులకు వర్క్ షాప్ ప్రారంభించామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ తెలిపారు. బ్రెనోవిజన్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై వర్క్​షాప్​ జరిగిందన్నారు. కార్యక్రమంలో కళాశాల ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.వి.రామచంద్ర రావు, జాకీర్ హుస్సేన్, పీ.మారేశ్వర రావు, సిహెచ్ రాజా జాకోబ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.