- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి
మదనాపురం, వెలుగు : వ్యవసాయంలో టెక్నాలజీని వాడాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. సోమవారం రామన్ పాడు గ్రామం లో రైతు బి కృపాకర్ రెడ్డి వ్యవసాయ పొలంలో డ్రోన్ ద్వారా వరి విత్తనాలు జల్లే కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి , వ్యవసాయ విశ్వవిద్యాల శాస్త్రవేత్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. సాధారణ వరి నాటుతో పోలిస్తే డ్రోన్ తో వెదజల్తే రైతులకు తక్కువ పెట్టుబడి అవుతుందన్నారు.
డ్రోన్ వ్యవసాయం తో యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. వ్యవసాయ నిపుణుల విజ్ఞప్తి తో నియోజకవర్గం లోని డ్రోన్లు ఆపరేటర్ గా చేస్తున్న యువకులకు తన సొంత నిధులతో లైసెన్స్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు అనంతరం ద్వారకానగరం, శంకరమ్మ పేటలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో 33 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు.