గుడ్ న్యూస్.. జస్ట్ పదో తరగతి..ఐటీఐతో మంచి జాబ్స్

గుడ్ న్యూస్.. జస్ట్ పదో తరగతి..ఐటీఐతో మంచి జాబ్స్

డీఆర్​డీఓ ఏఆర్​డీఈలో 

అప్రంటీస్​ ఖాళీలు

వివిధ విభాగాల్లో అప్రంటీస్ కోసం డీఆర్​డీఓ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్(డీఆర్​డీఓ ఏఆర్​డీఈ) అప్లికేషన్లను కోరుతున్నది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీలోగా ఆన్ లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య: 70

పోస్టులు: ఎలక్ట్రిషియన్ 08, ఫిట్టర్ 17, మెషినిస్ట్ 08, మెషినిస్ట్ గ్రిండర్ 01, మెకానిక్ మెషీన్ టూల్ మెయింటెనెన్స్ 01, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 16, మెకానిక్ మోటార్ వెహికల్ 01, రిఫ్రిజిరేషన్ అండ్​ ఎయిర్ కండిషనింగ్ 01, ఫొటోగ్రాఫర్ 02, టర్నర్ 10, వెల్డర్ ‌‌‌‌02, కార్పెంటర్ 01, డ్రాఫ్ట్స్​ మెన్ మెకానికల్ 02. 

ఎలిజిబిలిటీ:  పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

అప్లికేషన్ ప్రారంభం:  ఏప్రిల్ 4. 

ఏఏఐలో జూనియర్ అసిస్టెంట్

జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్) పోస్టుల భర్తీకి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఏఏఐ) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 11వ  తేదీలోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య: 89

పోస్టులు: జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) ఎన్ఈ–4

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి లేదా సమాన ఉత్తీర్ణతోపాటు మెకానికల్, ఆటోమొబైల్స్, ఫైర్ లో డిప్లొమా లో ఉత్తీర్ణ సాధించి ఉండాలి. హెచ్ఎంవీ, ఎల్ఎంవీ లైసెన్స్‌‌ కలిగి ఉండాలి.

వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 18 ఏండ్లు, గరిష్టంగా 30 ఏండ్లు మించకూడదు.

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.