ఎండిన మోడు.. ఎవ్వరికి మూడేనో!

ఎండిన మోడు.. ఎవ్వరికి మూడేనో!

 పెనుబల్లి, వెలుగు : ఖమ్మం–అశ్వారావుపేట జాతీయ రహదారిపై ఎండిన చెట్ల మోడులు ప్రమాదకరంగా కనపడుతున్నాయి. పెనుబల్లి మండలం మండాలపాడు లంకపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఉన్న భారీ చెట్లు ఎండిపోగా, కొన్ని చెట్లకు పెద్ద కొమ్మలు ఎండి రహదారిపైకి ఉన్నాయి. ఎండిన చెట్లను, కొమ్మలను నేషనల్ హైవే అధికారులు తొలగించకుండా పట్టించుకోవడం లేదు. 

గతేడాది సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామం వద్ద ఇదే రోడ్డుపై ఎండిన కొమ్మలు విరిగి బైక్ పై వెళ్తున్న వారిపై పడటంతో ఎనిమిదేళ్ల చిన్నారి మృతిచెందింది. అధికారులు వెంటనే స్పందించి ఎండినచెట్ల మోడులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.