ఇయర్ ఎండ్.. చాలామంది టూర్లకు వెళ్లేందుకు రెడీ అవుతుంటారు. ఇది చలికాలం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే టూర్లకు ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇలాంటి మినీ గీజర్లను వెంట తీసుకెళ్లాలి. ఇది నీళ్లను క్షణాల్లో వేడి చేసి ఇస్తుంది. డ్రమ్స్టోర్ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ గీజర్‌ని ఏబీఎస్ షాక్‌ప్రూఫ్, హీట్ రెసిస్టెంట్ మెటీరియల్‌తో తయారుచేశారు. ఇందులో కాపర్‌తో చేసిన హీటింగ్ ఎలిమెంట్, నియాన్, ఐఎస్‌ఐ-స్టాట్-గ్రీన్ హీటింగ్ ఎలిమెంట్లు ఉంటాయి.
క్షణాల్లో ఇన్‌స్టాలేషన్ పూర్తవుతుంది. సాధారణ గీజర్లతో పోలిస్తే 20 శాతం వరకు కరెంట్ ఆదా అవుతుంది. దీనికి రెండు నాజిల్స్ ఉంటాయి. ఒకవైపు నీటి పైపుని జాయింట్ చేస్తే.. మరో వైపు నుంచి వేడి నీళ్లు బయటికి వస్తాయి. ఇందులో ఇంటెలిజెంట్ ఆటో కట్-ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది. గీజర్‌ని కొద్దిసేపు వాడకపోతే.. ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది.
ధర : రూ. 1,395