
- ఇద్దరికి తీవ్ర గాయాలు
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్మన్సూరాబాద్ లో బుధవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. సహారా సమీపంలో ఓ బైక్ ను ఢీకొట్టి, కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. అయ్యప్ప స్వామి టెంపుల్సమీపంలో పలు బైక్ లను ఢీకొని ఆగింది. ఢీకొన్న బైక్ పై ఉన్న దివ్యాన్ష్అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రాక్టౌన్కాలనీకి చెందిన బోర్ వెల్ వ్యాపారి ప్రభాకర్ రెడ్డి మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లినట్లు గుర్తించారు.
ప్రభాకర్ రెడ్డికి సైతం గాయాలయ్యాయి. బైకును ఢీకొట్టి కారు ఈడ్చుకెళ్తున్న టైంలో నిప్పు రవ్వలు చెలరేగాయి. కాసేపు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.