తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బల .. కొత్త డబ్బింగ్ షురూ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ లీడ్ రోల్స్‌‌‌‌లో ఎస్ ఒరిజినల్స్ అండ్ మూవీ వెర్స్ స్టూడియోస్ సంస్థ ఓచిత్రాన్ని నిర్మిస్తోంది. కొత్త దర్శకుడు ఏఆర్‌‌‌‌‌‌‌‌ సజీవ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.  తాజాగా డబ్బింగ్‌‌‌‌ పనులు మొదలు పెట్టారు.  బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివన్నారాయణ, గోపరాజు  విజయ్, సురభి ప్రభావతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 

 జయ్ క్రిష్   సంగీతం అందిస్తుండగా దీపక్ ఎరగరా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నంద కిషోర్ ఈమని డైలాగ్స్ అందిస్తున్నారు.  సృజన్ యరబోలు, వివేక్ కృష్ణాని, సాధిక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.