ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు శ్రీపాదరావు

ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు శ్రీపాదరావు

నస్పూర్/నిర్మల్/కోల్ బెల్ట్, వెలుగు: మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజల ప్రతినిధిగా విశిష్ట సేవలు అందించిన శ్రీపాదరావు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ కొనియాడారు. కలెక్టరేల్​లో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ తో కలిసి శ్రీపాదరావు శ్రీపాదరావు ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషిచేసిన మహోన్నత వ్యక్తి శ్రీపాదరావు అన్నారు. 

మంథని ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్ గా వివిధ పదవుల్లో పనిచేశారని గుర్తుచేశారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ కలెక్టరేట్​లో డీవైఎస్​వో శ్రీకాంత్ రెడ్డి, అధికారులు శ్రీపాదరావు ఫొటోకు పూల మాల వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు సర్పంచ్‌గా జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్‌గా సేవలందించారని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ, వారి కష్టాల్లో పాలుపంచుకొని ప్రజానా యకుడిగా ఎదిగారన్నారు. శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్​ వద్ద జీఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో, మందమర్రి ఏరియా కల్యాణి ఖని ఓపెన్​ కాస్ట్​ మైన్​పై శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీపాదరావు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు