సీతారామం వంటి క్లాసికల్ హిట్‌తో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దుల్కర్.. రీసెంట్‌గా మరో క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. దుల్కర్ హీరోగా కింగ్ ఆఫ్ కోతా(King of Kotha) టైటిల్‌తో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ గా ఏ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) చేతులు మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. షారుఖ్ మాట్లాడుతూ.. ఆకట్టుకునే కింగ్ ఆఫ్ కోతా ట్రైలర్‌కు నా బెస్ట్ విషెష్..దుల్కర్ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్న.ఈ మూవీకు వర్క్ చేసిన టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ తెలియజేశారు. అలాగే ఈ మూవీపెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్న అని పేర్కొన్నారు. అలాగే ఈ ట్రైలర్ ను సౌత్ సినిమా లెజెండ్స్ మోహన్‌లాల్,సూర్య, నాగార్జున పలు భాషల్లో రిలీజ్ చేశారు.
ఇక ట్రైలర్ లో.. రాజు చిన్నప్పటి యాంబిషన్ ఎంటో తెలుసా సార్..వాళ్ల నాన్నలా పెద్ద రౌడీ అవ్వాలని అనేవాడు. అప్పుడు కోతా రాజు చేతిలో ఉండేది అనే డైలాగ్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవ్వగా.. ఆ డైలాగ్‌తోనే సిగరెట్ వెలిగిస్తూ స్టైలిష్ దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. ఇక నీ ముందే ఉన్నా..నువ్వు ఏం పీకుతావో పీక్కో.. అంటూ రౌడీలను దుల్కర్ సల్మాన్ సవాల్ విసిరే సీన్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలుస్తోంది.
ALSO READ :నేను ఎక్కడున్నా నువ్వు నా గుండెల్లోనే.. సుధీర్ కామెంట్స్ వైరల్
కోతా అనే సిటీపై ఆధిపత్యం కోసం రెండు వర్గాల పోరుతో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు కనిపిస్తోంది. ఇందులో దుల్కర్ మాసివ్ లుక్‌తో ఇంప్రెస్ చేస్తున్నారు. ఇంటెన్సివ్‌గా ఉన్నఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక రీసెంట్ గా చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ దుల్కర్ క్యారెక్టర్ గురుంచి ట్వీట్ చేసింది. కొందరు అతనికి భయపడతారు..కొందరు అతన్ని గౌరవిస్తారు..కొందరు అతన్ని ప్రేమిస్తారు. కానీ నిజంగా అతనెవరో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు..అంటూ దుల్కర్ క్యారెక్టర్ గురించి ట్వీట్ చేసింది.
అభిలాష్ జోషి(Abhilash Joshiy) డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.