- గతేడాదితో పోలిస్తే రూ.5 కోట్లకు పైన తగ్గిన సేల్స్
- ఎన్నికల కారణంగా నిరుడు రికార్డు సేల్స్
- ఈసారి బెల్ట్‌షాపులకు చెక్పెట్టడమూ తగ్గుదలకు కారణమే
హైదరాబాద్ సిటీ, వెలుగు: దసరా పండుగ సందర్భంగా ఈ ఏడాది మద్యం అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ. 5 కోట్ల 66 లక్షల ఆదాయం తగ్గినట్లు ఎక్సైజ్అధికారులు విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. నిరుడు దసరా టైంతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్1 నుంచి 10వ తేదీ వరకు అమ్మకాలు కాస్త తగ్గాయి. గ్రేటర్ హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, శంషాబాద్, సరూర్‌నగర్, వికారాబాద్ జిల్లాల్లోని డీపీఈవో పరిధుల్లో 615 మద్యం దుకాణాలుండగా, 2023లో రూ.301.25 కోట్ల ఆదాయం వచ్చింది.
అయితే, ఈ ఏడాది అదే పది రోజుల్లో రూ.295.59 కోట్లు మాత్రమే సమకూరింది. హైదరాబాద్పరిధిలో ఏకంగా రూ.7.06 కోట్ల ఆదాయం తగ్గగా, సికింద్రాబాద్‌లో 2.15 కోట్లు, శంషాబాద్‌లో రూ. 1.67 కోట్లు, మల్కాజిగిరిలో రూ. 44 లక్షల ఇన్‌కం తగ్గింది. మేడ్చల్, సరూర్‌నగర్‌లలో మాత్రమే గతంలో కంటే 5.66 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది.
ఎందుకు తగ్గిందంటే..
గత ప్రభుత్వ హయాంలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా బెల్ట్‌షాపులను నిర్వహించారన్న ఆరోపణలున్నాయి. దీంతో జనాలను మత్తుకు బానిసలు చేసి వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపాలని అనుకోవడం లేదని, అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపుల పని పడతామని కాంగ్రెస్‌పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే చాలాచోట్ల బెల్ట్‌షాపులు లేకుండా చేసింది. ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలతో ఎక్కడికక్కడ బెల్ట్‌షాపులకు చెక్‌పడింది.
గతేడాది బెల్ట్‌షాపుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మద్యం షాపుల నుంచి ఎక్కువ లిక్కర్అక్కడికే తరలిపోయిందని, దీంతో ఆదాయం ఎక్కువగా వచ్చిందని, ఈసారి వాటి సంఖ్య తగ్గడంతో ఇన్‌కం కూడా తగ్గిందని ఓ అధికారి చెప్పారు. అలాగే గతేడాది దసరా టైంలో ఎన్నికల కోడ్ఉండడంతో ముందుగానే షాపుల నుంచి మద్యాన్ని డంప్చేసుకున్నారు. నిరుడు అక్టోబర్24న దసరా రాగా, అక్టోబర్9న ఎన్నికల షెడ్యూల్రిలీజ్అయ్యింది. దీంతో అభ్యర్థులు, ఆశావాహులు ముందుగానే మద్యం బాక్సులను తీసుకువెళ్లి పెట్టుకున్నారు. దీంతో గతేడాది రికార్డు స్థాయిలో ఏకంగా 301.25 కోట్ల లిక్కర్అమ్మకాలు జరిగాయి.