హైదరాబాద్: నగరంలోని లక్డికపూల్ లో ఢిల్లీకి చెందిన కితాబ్ లవర్స్ సంస్థ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసింది. లోడ్ ది బాక్స్ అనే థీమ్ తో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత దుర్జోయ్ దత్తా ప్రారంభించారు. ఆమె రాసిన ‘వెన్ ఐ యామ్ విత్ యూ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తన పుస్తంలో ప్రేమ, స్నేహం, హృదయ విదారకత వంటి ఎన్నో అంశాలు ఉన్నాయని ఈ సందర్భంగా వివరించారు.
పుస్తక ప్రదర్శనలో ఫాంటసీ, నాన్ ఫిక్షన్, క్రైమ్, ఇన్ స్పైరబుల్ తదితర విభాగాలకు చెందిన ఎన్నో అంశాలకు సంబంధించిన బుక్స్ అందుబాటులో ఉంచినట్లు కితాబ్ లవర్స్ వ్యవస్థాపకులు రాహుల్ పాండే తెలిపారు.