సైబర్ నేరగాళ్ల మాయలో చదువుకున్న వారే ఎక్కువగా పడుతున్నారు : రంగనాథ్

 రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ ఎక్కువ అయ్యాయని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. రోజుకి కోటి రూపాయల చొప్పున సైబర్ నేరగాళ్లు దండుకుంటున్నారని అన్నారు. రోజుకు సగటున 15 కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 34 కోట్లు సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారని అన్నారు. ఇవి కేసులు నమోదు ఆధారంగా మాత్రమేనని బయట పడనివి మరిన్ని ఉంటాయని తెలిపారు. సైబర్ క్రైమ్ లో కోల్పోయిన డబ్బును వెనక్కి తీసుకు రావడం కష్టతరమని చెప్పారు. 

సైబర్ చీటింగ్ కి గురైతే వెంటనే 2-3 గంటల్లో ఫిర్యాదు చేస్తే ఎదైనా ఫలితం ఉంటుందని రంగనాథ్ తెలిపారు. అత్యాశకి పోవడం వల్లే సైబర్ నేరాల బారిన పడుతున్నారని అన్నారు. అధిక లాభాలకు అట్రాక్ట్ అయ్యి డబ్బులు పోగొట్టుకుంటున్న వారే ఎక్కువ అని అన్నారు. సైబర్ నేరగాళ్ల మాయలో పడుతున్న వారిలో చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారని ఇందులో యువత ఎక్కువగా ఉన్నారని చెప్పారు.

ALSO READ :- ప్రేమించుకున్నారు.. కానీ వరుసకు అన్నాచెల్లెల్లు ప్రేమికుల రోజే ఘోరం

  మీ పేరుతో వచ్చిన కొరియర్ లో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పగానే  భయపడి వ్యక్తిగత వివరాలు ఇచ్చి మోసపోతున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. సైబర్ నేరాల పెరుగుతున్న క్రమంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. సినీ సెలబ్రిటీలు ద్వారా కూడా అవేర్నెస్ కల్పిస్తామన్నారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్నావాడు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారని మోసపోతున్నది మాత్రం హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటున్నారని సీపీ తెలిపారు.