- విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
హైదరాబాద్, వెలుగు: అమ్మాయిల్లో ధైర్యాన్ని, భయాన్ని అధిగమించే ఆత్మవిశ్వాసం పెంచాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ ఆదివాసీ భవన్లో 495 కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్ల సమావేశంలో వెంకటేశం ముఖ్య అథితిగా మాట్లాడారు. నాస్ 2024 పరీక్షల ఫలితాలు పెరుగుపడేలా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు కృషి చేయాలని సూచించారు. వ్యక్తిగత సేవ కంటే సమాజ సేవ గొప్పదని చెప్పారు. అమ్మాయిల రక్షణపై ప్రత్యేకంగా దృషి పెట్టాలని సూచించారు.
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేజీబీవీల్లో మెను ప్రకారం భోజనం అందించాలన్నారు. శానిటైజేషన్ సక్రమంగా ఉంచుకోవాలన్నారు. సమావేశంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, సమగ్ర శిక్ష రాష్ట్ర అధికారులు రాజీవ్, వెంకటనర్సమ్మ, ఫైనాన్స్ ఆఫీసర్ వెంకన్న పాల్గొన్నారు.