ఏడుపాయలలో భక్తుల సందడి

ఏడుపాయలలో భక్తుల సందడి

ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం, తలనీలాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై శ్రీనివాస్​ గౌడ్​ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. - పాపన్నపేట, వెలుగు