ఏపీలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. మాచర్ల సీఐ పి.శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్‌ఐ వంగా శ్రీహరిని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వెంటనే కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
బదిలీ చేసిన అధికారులకు బాధ్యతలు అప్పగించకూడదని ఈసీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వర్‌రెడ్డి, సదుం ఎస్సై మారుతిపై మంగళవారం ఎన్నికల సంఘం బదిలీవేటు వేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డితోపాటు అనంతపురం రేంజి డీఐజీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డిని కూడా ఈసీ బదిలీ చేసింది. కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు.