ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి

ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
  • ఎన్నికల అబ్జర్వర్ మహేశ్ దత్ ఎక్కా

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్​మహేశ్ దత్ ఎక్కా అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో ఎన్నికల నోడల్, ఏఆర్ వో అధికారులతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు తారా డిగ్రీ కాలేజీలో పోలింగ్ కేంద్రాన్ని, అంబేద్కర్ స్టేడియంలోని డీఆర్సీ సెంటర్ ను కలెక్టర్ క్రాంతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారుల వివరాలను కలెక్టర్ క్రాంతిని అడిగి తెలుసుకున్నారు.

 విధులకు హాజరు కాని ఉద్యోగులకు షో కాజ్ నోటీసులు జారీచేసి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి ఎన్నికలకు సంబంధించి మొదటి, రెండో రాండమైజేషన్ పూర్తి చేశామని, మూడో రాండమైజేషన్ కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా అన్ని రకాల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ మాధురి, అడిషనల్​ఎస్పీ సంజీవ్ రావు, ట్రైనీ కలెక్టర్ మనోజ్,  జిల్లాలోని నోడల్ అధికారులు, ఆర్ వోలు, తహసీల్దార్లు, ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు.